బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు పౌరులు దుర్మరణం పాలయ్యారు. బ్రటిన్‌లో షెఫీల్డ్ అనే ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, వరంగల్‌కు చెందిన పావని, ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన సాయి నరసింహాలు ఉన్నారు.
ట్రక్కు, వ్యాను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.