సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (20:00 IST)

దొంగతనానికి ఆటోలో వచ్చి.. మత్తు మందు చల్లి... ఆటో ఎక్కలేని దొంగలు...

హైదరాబాద్ అత్తాపూర్ హుడా కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా మెయిన్ డోర్ పగులగొట్టి ఇంటిలో నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి బీరువాలో దాచిన బంగారం, డబ్బు దోచుకెళ్లారు. దొంగతనానికి ఆటోలో వచ్చిన దొంగలు ఆటో ఇంజన్ ఆపకుండా ఓ ఇంటిలోకి చొరబడ్డారు.
 
నిద్రిస్తున్న వారిపై మత్తుమందు చల్లి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు నగలు, డబ్బంతా మూటగట్టుకుని పారిపోతుండగా ఆటో ఇంజన్ శబ్దానికి ఇంటి యజమాని కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు నిద్రలేచారు. దీంతో జనం పట్టుకుంటారని భావించిన దొంగలు ఆటో వదిలి చోరీ సొత్తు మూటగట్టుకుని ఉడాయించారు. ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు.