గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:08 IST)

హోటల్‌ పనిలో బిజీ బిజీగా వున్న సర్పంచ్ అనురాధ

Sarpanch Anuradha
Sarpanch Anuradha
మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరోనిగూడెం సర్పంచ్‌ అనురాధ హోటల్‌లో తనపని తాను చేసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తన భర్త చూసుకుంటున్నారని అనురాధ పేర్కొంటున్నారు. 
 
మునుగోడు ఉప ఎన్నికల వేళ నాయకులంతా ప్రచారంలో బిజీగా వున్న నేపథ్యంలో.. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనురాధ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 
 
అయితే చండూరులో నామినేషన్‌ సందర్భంగా ఆమె నడిపిస్తున్న హోటల్‌కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ప్రచారంలో పాల్గొనకుండా హోటల్‌లో పనిచేసుకుంటున్నారు.
 
ఇకపోతే.. ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీకి టీఆర్ఎస్ కీల‌క నేత‌, మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే... ఉప ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.