ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:30 IST)

తెలంగాణాలో తెరాస సర్పంచ్ కారును తగలబెట్టిన దుండగులు

trs car fire
తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్పంచ్ కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్క్ చేసి వుండగా, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్.ఐ. అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజకీయ కక్షతోనే, ఉద్దేశపూర్వకంగా తన కారును ఎవరో నిప్పు అంటించారని సర్పంచ్ బాలమణి వాపోతున్నారు. 
 
కాగా, కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మిర్‌‍దొడ్డి మండలం అక్బర్ పేటలో తెరాస సర్పంచ్ స్వరూపకు చెందిన కారు, ట్రాక్టర్‌కు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెల్సిందే. ఇంటి ముందు నిలిపివున్న ఈ వాహనాలకు  ఇదే విధంగా నిప్పుపెట్టారు.