ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:09 IST)

దేశంలో గణనీయంగా తగ్గిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది చనిపోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,4ీ6,12,013కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 658 తగ్గి 28,593గా నమోదైంది. 
 
ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కొత్తగా మహమ్మారి బారిన పడి 21 మంది మరణించారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
 
రోజువారీ పాజిటివిటీ రేటు 1.15 శాతంగా ఉంది. అదే వీక్లీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 218.97 కోట్ల కరోనా వ్యాక్సిస్‌ డోసుల్ని పంపిణీ చేశారు. 
 
గత 24 గంటల్లో నమోదైన మరణాల్లో ఒక్క కేరళలోనే 16 మంది ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. ్