ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (13:41 IST)

దివ్యాంగుడిపై గ్రామ సర్పంచ్ కన్నెర్ర... కాలితో తన్నాడు...

Sarpanch
Sarpanch
దివ్యాంగుడిపై గ్రామ సర్పంచ్ కన్నెర్ర చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌.. దివ్యాంగుడిపై జులుం ప్రదర్శించాడు. తనకు రావాల్సిన ఉపాధికూలీ డబ్బులను అడిగనందుకు రెచ్చిపోయిన సర్పంచ్‌.. అందరు వారిస్తున్న దివ్యాంగుడిని కాలితో తన్నాడు. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులే సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
దివ్యాంగుడు కృష్ణయ్య ఇటీవల మండల అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ శ్రీనివాసులు గురువారం సాయంత్రం కృష్ణయ్య ఇంటికెళ్లి అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగాడు.
 
ఈ క్రమంలో కృష్ణయ్యపై సర్పంచ్‌ దాడి చేశాడు. అయితే దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఎస్పీ స్పందించారు. వెంటనే సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని స్థానిక ఎస్సై రవినాయక్‌ను ఆదేశించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు.