Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు ఇంజెక్షన్ వేసుకుని స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య.. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగేళ్లుగా పని చేస్తున్న ఓ స్టాఫ్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. తాను పని చేసే ఆస్పత్రి నుంచి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన సౌందర్య (25) సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ ఆస్పత్రి హాస్టల్‌లోనే నివసిస్తోంది. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. 
 
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments