Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పిల్లను చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడు...

ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను ఆ యువకుడు గుడ్డిగా నమ్మేశాడు. ఆ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడంటూ ఆరోపిస్తూ ఓ యువతితో కుదిరిన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

Written By pnr
Updated: బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:29 IST)
ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను ఆ యువకుడు గుడ్డిగా నమ్మేశాడు. ఆ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడంటూ ఆరోపిస్తూ ఓ యువతితో కుదిరిన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. చివరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ కాలనీకి చెందిన పొన్నమల్లు లక్ష్మి, వెంకటయ్య కుమారుడు అనిల్‌కు, సిద్దిపేట మండలం పొన్నాల మధిర గ్రామమైన బట్రాంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ, నర్సింలు కుమార్తె స్వప్నతో రెండుమూడు నెల్ల క్రితమే వివాహం నిశ్ఛయమైంది. గత రెండుమూడు నెలలుగా శుభముహుర్తాలు లేక పోవడంతో ఫిబ్రవరి 22వ తేదీ నిశ్చితార్థం, మార్చి 8వ తేదీన పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నారు. ఈ మేరకు పెళ్లికుమార్తె తరపు వారు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకున్నారు. 
 
ఇంతలో పెళ్లికుమారుడు అనిల్ సిద్ధిపేటలోని రాజుపంతులు అనే జ్యోతిషుడికి అమ్మాయి పుట్టిన తేదీ ప్రకారం జాతకం చూపించాడు. పెళ్లి కుమార్తె జాతకం ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తకు లేదా మామకు ప్రాణహాని తప్పదని చెప్పడంతో ఈ పెళ్లికి వరుడు అనిల్ నిరాకరించాడు. దీంతో ఆందోళనకు గురైన పెళ్లి కూతురి తరుపు బందువులు జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. 
 
ఈ విషయమై జ్యోతిష్యుడిని నిలదీయడంతో పెళ్లికుమారుడు చూపిన జాతకం ప్రకారం అమ్మాయి పేరు మీద బలం లేదని, పెరు మార్చుకోవాలని మాత్రమే సూచించాని చెప్పాడు. అయితే, వరుడు మాత్రం జ్యోతిష్యుడు మరోలా చెప్పాడనీ, అందువల్ల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబనని తెగేసి చెప్పాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో సిద్దిపేట ఒకటో పట్టణ పోలీసులు పెళ్లి కొడుకు అనిల్, జ్యోతిష్కుడు రాజు పంతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments