శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (16:08 IST)

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు మీద ఫిలింన‌గ‌ర్ టెంపుల్‌లో ప్ర‌త్యేక పూజ‌లు..!

స్వార్ధ రాజకీయ కారణాలతో విభజించబడి, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ప్రత్యేకంగా ఆంధ్ర యువత యొక్క భవిష్యత్తు దినదినాభివృద్ధి కొర‌కు, రాబోయే తరం బాగుండాలంటే జనసేన అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఫిలింన‌గ‌ర్ టెంపుల్‌లో ప్ర‌త్యేజ పూజులు చేయిస్తున్నారు.
 
ఆంజనేయ స్వామి భక్తుడైన శ్రీ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో అధికారం లోకి రావాలని ఆకాక్షింస్తూ, దేశవిదేశాల్లో ఉన్న జన సైనికులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. తోటి జన సైనికులు కూడా మీ దగ్గరిలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాలలో శ్రీ పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించవలసినదిగా ప‌వ‌న్ అభిమానులు పిలుపునిచ్చారు.