Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో 40 కి.మీ వేగం దాటితే జేబుకు చిల్లే...

Written By ఠాగూర్
Updated: గురువారం, 30 డిశెంబరు 2021 (08:42 IST)
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరుగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నగరంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, అతివేగ వాహనదారులకు కళ్లెం వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల వేగం 40 కిలోమీటర్లు దాటడానికి వీల్లేదని హుకుం జారీచేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు. 
 
అన్ని రకాల వాహనాలు ఇదే వేగంతో నడపాలని ఆదేశించారు. ఒకవేళ ఈ వేగ పరిమితి దాటిన పక్షంలో రూ.1035కు ఈ-చలాన్ ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుందని ఆయన జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ప్రధానంగా కూకట్‌పల్లి జేఎన్టీయూ సర్కిల్, జుబ్లీహిల్స్ చెక్క పోస్ట్, హైటెక్ సిటీ క్రాస్ రోడ్డు, ట్యాంక్ బండ్ రోడ్డు, సుచిత్రా జంక్షన్‌లలో ఈ వేగం పరిమిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. 
 
వాహనాల వేగాన్ని స్పీడ్ గన్స్‌ నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. అయితే, ప్రధాన జంక్షన్‌‍లలో స్పీడ్ గన్స్‌ను అమర్చడాన్న భాగ్యనగరి వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకే వెళుతున్నారు. 40 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే సీసీటీవీ కెమెరాలు ఆటోమేటిగ్గా కఈ-చలాన్‌ను జనరేట్ చేస్తాయని పోలీసులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

Tanikella Bharani: మినీ శంకరాభరణం తరహాగా పాటకు ప్రాణం చిత్రం ప్రారంభం

Sundeep Kishan: సందీప్ కిషన్ చిత్రం సిగ్మా రిలీజ్ కు రెండు అగ్ర సంస్థలు అండగా నిలిచాయ్

ఫ్యామిలీ నడపలేకపోతున్నా, బ్యాంక్ ఎకౌంట్స్ అన్‌ఫ్రీజ్ చేయించండి ప్లీజ్: ఐబొమ్మ రవి రిక్వెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో సైకలాజికల్ థ్రిల్లర్ హతహ: టీజర్ ఫిక్స్:

తర్వాతి కథనం
Show comments