శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (15:56 IST)

టీవీ మ‌హిళా క‌ళాకారుల‌కు భ‌ద్ర‌త‌

TV Artists Association
టీవీ క‌ళాకారుల సంఘం ఇటీవ‌లే టీవీ నిర్మాత‌ల మండ‌లిని క‌లిసి క‌ళాకారుల స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించింది. గ‌త కొంత‌కాలంగా మ‌హిళా క‌ళాకారులు రాత్రి పూట షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళే క్ర‌మంలో ఇబ్బందులు త‌లెత్త‌డం వంటి జ‌రుగుతున్నాయి. అదే విధంగా కాల్ షీట్ టైమింగ్స్ సమస్య, పేమెంట్స్ సమస్య వంటివి వున్నాయి. అదేవిధంగా వారం వారం ఇచ్చే పేమెంట్ విష‌యంలో వారాల విదానం ర‌ద్ద చేయాల‌ని కోరారు.
 
టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమస్యలపై కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఇటీవ‌లే నిర్మాత‌ల‌మండ‌లి అధ్య‌క్షుడు ప్ర‌సాద్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించారు. త‌క్ష‌ణంలో అమ‌లు అయ్యేలా చూస్తామ‌ని ఆయ‌న తెలియ‌జేశార‌ని టివీ క‌ళాకారుల సంఘం అధ్య‌క్షుడు వినోద్‌బాల తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముర‌ళీకృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ: విజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వినోద్‌బాల మాట్లాడుతూ, ప్ర‌తీ షూటింగ్‌లోనూ పైన పేర్కొన్న మార్పుల‌ను అంద‌రూ పాటించేలా చూసుకోవాల‌ని స‌భ్య‌ల‌కు సూచించారు.
 
స‌మ‌స్య‌లు ఇవే..
కాల్ షీట్ టైమింగ్స్ సమస్య, పేమెంట్స్ సమస్య పై తీసుకున్న నిర్ణయాన్ని అందరు సభ్యులు తప్పక పాటించాలి. 
వారాల విధానం రద్దు చేయాలని కోరడం జరిగింది.
 రాత్రి 9 తర్వాత ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకి భద్రతా దృష్ట్యా కంపెనీ వెహికల్ లో డ్రాప్ చేయాలని కోరడం జరిగింది.