Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హైదరాబాదీ బిర్యానీపై తాలిబన్ల ప్రభావం.. కారణం అదేనా?

Written By సెల్వి
Updated: శనివారం, 21 ఆగస్టు 2021 (14:35 IST)
నోరూరించే హైదరాబాదీ బిర్యానీపై తాలిబన్ల ప్రభావం పడేలా ఉంది. అఫ్ఘాన్‌లో అల్లకల్లోల పరిస్థితుల కారణంగా ఇక్కడి బిర్యానీ ఘుమఘుమలు తగ్గే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బిర్యానీలో వినియోగించే డ్రై ఫూట్స్‌ను అఫ్గాన్ నుంచి చాలా వరకు దిగుమతి చేసుకుంటారు. అయితే ఇప్పుడా డ్రై ఫ్రూట్స్‌ దిగుమతి ఆగిపోయింది. బిర్యానీకి రుచిని తీసుకురావడంలో డ్రై ఫ్రూట్స్ పాత్ర కూడా కీలకం. 
 
ఎండుద్రాక్ష, ఆల్మండ్‌, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో వాడుతారు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువ వరకు అఫ్ఘాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌లో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును ఉపయోగిస్తున్నాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ అయిన జీడిపప్పు, కిస్మిస్‌ వినియోగం కూడా ఎక్కువగానే ఉంటోంది. అఫ్గాన్‌లోని ఎగుమతి దారులతో హైదరాబాదీ వ్యాపారులకు ప్రస్తుతం సంబంధాలు లేవు. 
 
తాలిబన్ల పాలనతో మన దగ్గర కూడా డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడేలా ఉంది. ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయ్..! సామాన్యులు భరించలేని స్థితికి ధరలు చేరాయి. భారీగా ధరలు పెరగడంతో డ్రై ఫ్రూట్‌ల వాడకం తగ్గించుకునేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. మరోవైపు డ్రైఫ్రూట్స్ ఉపయోగించి చేసే బిర్యానీ వంటకాల రేట్లను పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments