మైనర్ బాలికపై 55 యేళ్ళ వ్యక్తి అత్యాచారం... ఎక్కడ?
ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. బయటే కాదు.. ఇంట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం, పాలమూరు జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయిలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. 55 యేళ్ల కామాంధుడు ఈ లైంగికదాడికి పాల్పడ్డాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బొడ్రాయి తండా గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక శనివారం ఉదయం తోటలో వేసిన మిర్చి కళ్ళం దగ్గరికి వెళ్లింది. తిరిగివస్తుందా కామాంధుడు ఇంటి దగ్గర రాగానే బలవంతంగా మైనర్ బాలికను ఇంట్లోకి ఎత్తుకొని వెళ్లి బలత్కారం చేసే క్రమంలో మైనర్ బాలిక కామంధుడితో పోరాటం చేసి బయటపడింది. ఈ విషయం ఎవరికీ చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో రెండు రోజుల నుంచి బాలిక అన్నం తిన కుండ కనీసం నీళ్లు కూడా తాగడం లేదు.
ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది అని బాలికను అడగగా విషయం తెలిసింది. అదే సమయంలో సీసీ కెమెరా ఉండడంతో కెమెరాను ఓపెన్ చేసి చూడగా బాలికా కామాంధుడు ఇంటి నుంచి ఏడుస్తూ బయటికొస్తున్న ఆధారంగా విషయం బయటకు పొక్కింది. వెంటనే తండా వాసులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.
ఈ సంఘటన డోర్నకల్ మండలంలో సంచలనంగా మారింది ఇలాంటి చర్యలకు పాల్పడిన బాధితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారు. అదే విధంగా నిందితుడిని పోలీస్ స్టేషన్ అప్పగించకుండా చట్టాన్ని అదుపులో తీసుకున్నందుకు గ్రామస్థులపై కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.