Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.... కీలక బిల్లుల ఆమోదానికి కసరత్తు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:06 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశంలో మృతి చెందిన శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. 
 
ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం సముఖంగా లేదు. 
 
మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ఆమోదింపజేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా, దళిత బంధుకు సంబంధించిన బిల్లు కూడా ఉంది. అటు విపక్షాలు కూడా ద‌ళిత‌బంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి. బ‌డ్జెట్లో నిధులు కేటాయించ‌కుండా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ప‌థ‌కాన్ని ఎలా అమ‌లు చేస్తారో చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అదేవిధంగా వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటోంది. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ అంశంతో పాటు ఉద్యోగ నియామకాలపైనా తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తంమీద ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments