శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (16:20 IST)

కరీంనగర్‌లో "హిందూ ఏక్తా యాత్ర"

bandi sanjay
"హిందూ ఏక్తా యాత్ర" పేరిట కరీంనగర్‌లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. లక్ష మందితో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశం వుంది. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందువుల సంఘటిత శక్తిని చాటి చెప్పేలా ఏక్తా యాత్ర కొనసాగాలని పిలుపునిచ్చారు.