ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ పుట్టినరోజున శుభాకాంక్షలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం తరపున, తెలంగాణ ప్రజల తరపున ప్రధాని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకా ప్రధానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశానికి ఇంకా చాలా సంవత్సరాల పాటు సేవ చేసేలా ప్రధాని ఆరోగ్యంగా వుండాలని కేసీఆర్ ప్రార్థించారు.