Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణలో కరోనా విజృంభణ.. 337మందికి పాజిటివ్

Written By సెల్వి
Updated: సోమవారం, 22 మార్చి 2021 (11:36 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా టెస్టులు నిర్వహించగా 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇందులో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 2,958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671కి చేరింది. ముఖ్యంగా పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 
 
గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య .. వెళితే కరోనా భయం..ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments