గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (17:29 IST)

ఇక యేటా ఉపాధ్యాయులు కూడా ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే..

telangana govt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఇక యేటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశిస్తూ ఉత్తర్వుులు జారీచేసింది. ఈ మేరకు ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 
 
స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, స్థిరాస్తి వ్యాపారం చేశారని జావీద్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.