సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (15:34 IST)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు - అవులకు రిమాండ్

avula subbarao
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఈస్ట్ కోస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అయితే, ఈ విధ్వంసానికి కారణం సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న ఆవులు సుబ్బారావు కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శనివారం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రైల్వే కోర్టు నుంచి సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ విధ్వంసం కేసులో దాదాపు 40 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.