గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (19:25 IST)

టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ - మచిలీపట్నం జైలుకు తరలింపు

టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆయన్ను గురువారం ఉదయం విజయవాడ మూడవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. దాంతో ఆయనకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించారు. దాంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, పట్టాభి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటిపై పలుమార్లు దాడి పాల్పడ్డారని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంనిగానీ, ప్రభుత్వంలో ఉన్న వారినిగానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. 
 
కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించారంటూ న్యాయమూర్తికి పట్టాభి తరపు న్యాయవాదులు వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై త్వరలోనే విచారణ జరుగనుంది.