శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (15:34 IST)

టీడీపీని ముంచడానికి చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఒక్కడు చాలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుది ఎంత నీచత్వానికి అయినా తెగించే మనస్తత్వం అని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం మొదలు పెట్టారని, కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. బూతులు సమర్థిస్తూ చంద్రబాబు దీక్షలు చేస్తున్నారా?, ఈ దీక్ష ఎవరి కోసమని మంత్రి నిలదీశారు. ప్రజలు ఆరాధించే గొప్ప మనిషిని బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సభ్య సమాజం తలదించుకునే రీతిలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి పదజాలం ఉందని అన్నారు. సిగ్గు వదిలేసి చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగా, దోపిడీ, కుట్రలేనని.. టీడీపీని ముంచడానికి చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఒక్కడు చాలు అని మంత్రి పేర్ని వ్యాఖ్యానించారు. అమిత్‌షాపై రాళ్లదాడి చేసినప్పుడు ఏపీ మాజీ సిఎం చంద్ర‌బాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు.