తెలంగాణాలో కొత్తగా ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!
ఉన్నత విద్యను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రుల ఉప సంఘం సిఫార్సు చేసింది. దీంతో ఐదు కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు కానున్నాయి.
ఈ ఐదు వర్శటీల్లో మెదక్ జిల్లాలో వోక్స్‌సెన్ యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో మహీంద్రా యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్కేసర్‌లో అనురాగ్ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ యూనివర్శిటీలు ఉన్నాయి.