మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

లంచం కేసులో తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అరెస్టు

ravinder gupta
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏలుబడిలో ఓ యూనివర్శిటీ ఉపకులపతి లంచం కేసులో అరెస్టు అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో తెలంగాణ యూనివర్శిటీ ఒకటి. వైస్ ఛాన్సలర్‌గా దాచేపల్లి రవీంద్ర గుప్తా కొనసాగుతున్నారు. ఈయన్ను ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. 
 
ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి నుండి రూ.50,000 లంచం తీసుకుంటుంటగా రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తమ కాలేజీకి పరీక్షా కేంద్రం కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డి.శంకర్ నుంచి లంచం తీసుకుంటుండగా గుప్తా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ సీనియర్ అధికారులు తెలిపారు.
 
ఏసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గుప్తాకు డబ్బు అందజేశారని, ఆ తర్వాత ఆయన సమక్షంలోనే అల్మారా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.10 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగంలో గుప్తా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి.