1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:30 IST)

బ్లేడుతో గొంతు కోసుకున్న వీఆర్‌ఏ.. ఎక్కడ?

Blade
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగింది.
 
వేతన సవరణ, పదోన్నతలు సహా పలు డిమాండ్ల సాధనం కోసం ఆ రాష్ట్రానికి చెందిన వీఆర్ఏలు గత 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే, మంత్రు గానీ, అధికారులు గానీ వారి ఆందోళనపై కించిత్ కూడా లెక్కచేయలేదు. దీక్ష చేపట్టి రోజులు గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 
 
వీరిలో ఖాసిం అనే వీఆర్ఏ నెక్కొండ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన సహచరులు ఖాసింను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు స్పందిస్తూ, సమస్యల పరిష్కారం కోస నెలల తరబడిన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు.