బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:38 IST)

నవరాత్రుల్లో పంచమి తిథి.. లలితా సుందరీ దేవిని పూజిస్తే?

Durga
నవరాత్రులలో దుర్గామాతను తొమ్మిది అవతారాల్లో పూజిస్తాం. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. ఇక ఈ రోజు 30వ తేదీ ఐదో రోజు.. అమ్మవారికి అంత్యంత ప్రీతకరమైన రోజుల్లో ఒకటి.
 
పంచమి రోజున కనక దుర్గ తల్లి.. లలితా సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్‌ నైవేద్యంగా పెట్టాలి. 
 
ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలని పండితులు చెబుతారు. ఈ రోజున వైష్ణవీ దేవిని, వరాహి మాతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.