సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:23 IST)

తెలంగాణలో నిలిచిపోయిన వారి వివరాలు తెలపండి- సీఎస్‌

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో నిలిచిపోయిన వారిని తరలించేందుకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో వారిని ఏ విధంగా వారి వారిస్వస్థలాలకు పంపాలన్న విషయం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈమేరకు రాష్ట్రంలో నిలిచిపోయిన వారి వివరాలను తెలపాల్సిందిగా ఆయా రాష్ర్టాల చీఫ్‌సెక్రటరీలకు లేఖ రాసినట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రక్రియనుపూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకనోడల్‌ అధారిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాను నోడల్‌ అఽధికారిగా నియమించారు.

తెలంగాణలో నిలిచిపోయిన వారిని, వారి రాష్ర్టాలకు తరలించడానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని  ఆయా రాష్ర్టాలను కోరినట్టు సోమేశ్‌కుమార్‌ వివరించారు. అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ర్టాలకు సంబంధించిన నోడల్‌ అధికారులను తెలంగాణ నోడల్‌ అథారిటీతో సంప్రదించాలని అన్నారు.

తెలంగాణలో నిలిచిపోయిన వారికి అవసరమైన స్ర్కీనింగ్‌ను నిర్వహించి వైరస్‌ లక్షణాలు లేని వారికి ప్రయాణం కోసం పాసులను తెలంగాణ నోడల్‌ అథారిటీ జారీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయి తమ రాష్ర్టాలకు వెళ్లాలనుకున్న వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు.