శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:13 IST)

మద్యం సేవించి వాహనాలు నడిపితే పదేళ్ల జైలు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో న్యూఇయర్‌ వేడుకలను నిషేధిస్తూ మందుబాబులకు షాక్‌ ఇచ్చిన తెలంగాణ పోలీసులు.. ఇప్పుడు మరో బాంబ్‌ పేల్చారు.

మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారెవరైనా సరే కఠినంగా శిక్షింప బడతారని అన్నారు సజ్జనార్.

తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్‌ అన్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్.. నిన్న ఒక్కరోజే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 402 మంది పట్టుబడ్డారని వెల్లడించారు.