శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (11:44 IST)

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల విలువ రూ. 600 కోట్లు, ఎంత వసూలు చేస్తారంటే?

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఉపశమనంగా, పెండింగ్ బకాయిలన్నింటినీ వసూలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్‌పై కోత విధించాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, గత ఎనిమిదేళ్లుగా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి దాదాపు రూ.600 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

 
మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రజల ఆర్థిక అస్థిరతను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ట్రాఫిక్ పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లపై వాహనదారులకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను ట్రాఫిక్ పోలీసులు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆమోదం కోసం పంపారు. అయితే, డీజీపీ సెలవులో ఉన్నందున, ఆయన కార్యాలయంలో చేరిన తర్వాత నివేదిక ఆమోదం పొందే అవకాశం ఉంది.
 
 
ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 75 శాతం, కార్లపై 50 శాతం, ఆర్టీసీ బస్సులపై 30 శాతం సబ్సిడీని అందజేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఉల్లంఘించినవారు ఆన్‌లైన్ లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా బకాయిలను చెల్లించవచ్చు. ఐతే ట్రాఫిక్ చలాన్లపై కోతకు అధికారులు ఆమోదం తెలపలేదని, అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు.