శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:57 IST)

కాంగ్రెస్‌లో కలకలం - కోమటిరెడ్డి ఇంటికి రేవంత్.. తెరాసతో పొత్తుపై క్లారిటీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టలేదని గుర్రుగా ఉన్న అసంతృప్తి నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం వెళ్లారు. వీరిద్దరూ భేటీ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపించిది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కోమటిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. 
 
"రేవంత్ రెడ్డి ఈ రోజు మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకునిరాగలమని భావిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.
 
కాగా, గతంలో టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌కు కట్టబెట్టింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి తన పంథాలో నడుస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒక దశలో ఆయన తెరాసలో కూడా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అలాంటి కోమిటిరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఇపుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.