Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్న బావామరదళ్లు.. మరో పెళ్లి ఖాయం చేయడంతో బలవన్మరణం

Written By ఠాగూర్
Updated: సోమవారం, 14 డిశెంబరు 2020 (12:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న బావామరదళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గాంధారి మండలం పోతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయి కుమార్, కామారెడ్డి మండలం వడ్లూర్‌ గ్రామానికి చెందిన గాండ్ల రమ్య(19)లు బావామరదళ్లు. వీరిద్దరూ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో రమ్యకు కుటుంబ సభ్యులు ఇటీవల మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఆందోళన చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
శనివారం ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. అనంతరం కామారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఇద్దరూ బస్సులో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్‌కు తెలపడంతో వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలిసంచారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా సాయికుమార్‌ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments