ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (15:06 IST)

అతి జాగ్రత్త : రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది.. ఎక్కడ?

train wheels tied
సాధారణంగా గృహాలు, భవనాలు, గోదాములు, ఆఫీసులు, బాత్రూమ్‌లు ఇలా ఎన్నింటికో తాళాలు వేయడం మనం చూశాం. కానీ, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు చక్రాలకు కూడా తాళాలు వేయాల్సి వచ్చింది. ఈ అరుదైన దృశ్యం హన్మకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఇలాంటి వాటిలో హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి చెరువు కూడా ఒకటి. ఈ చెరువు ఉధృతంగా ప్రవహించడంతో అటువైపుగా వెళ్లాల్సిన గూడ్సు రైలును కాజీపేట రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. 
 
ఈ క్రమంలో రైలు బ్రేకులకు లాక్ చేయడంతో పాటు సిబ్బంది ముందు జాగ్రత్తగా చక్రాలను ఇనుప గొలుసులతో పట్టాలకు కట్టి తాళం వేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రూ.10 కోట్లు గెలుచుకున్న మహిళలు 
 
కేరళకు చెందిన 11 మంది మహిళలకు అదృష్ణం అనూహ్యంగా వరిచింది. వారంతా రాత్రికి రాత్రి వారంతా లక్షాధికారులైపోయారు. రూ.250 లాటరీ టిక్కెట్టును 11 మంది డబ్బులు పోగేసి మరీ కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ డ్రా తగిలింది. దీంతో వారు కోట్లాది రూపాయలను గెలుచుకున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని పరప్పన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించిన రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించే పనులు చేస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం. ముఖ్యంగా వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ బంపర్ డ్రా లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే, వారివద్ద కేవలం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంట్ లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. 
 
దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.