Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వరిధాన్యం కొనుగోలు పంచాయతీ

Written By సెల్వి
Updated: సోమవారం, 20 డిశెంబరు 2021 (13:12 IST)
వరిధాన్యం కొనుగోలు పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఈ విషయంపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు హస్తినకు వెళ్లనున్నారు తెలంగాణ మంత్రులు. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అప్పాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 
 
ఇప్పటికే సగం కేబినెట్‌, ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మంత్రులు కూడా అక్కడికి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది.  
 
ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రంపైఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలుపగా.. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా నిరసనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 
 
ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.ో

అన్నీ చూడండి

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

Divi: స్టువర్టుపురం స్టూడెంట్స్ లో నేను భరతనాట్యం, బెల్లి డాన్స్ చేశా : దివి

Suriya: హృదయాలను హత్తుకునే విధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

సింగిల్‌గా ఉండటమే చాలా సంతోషంగా ఉంది : అమీషా పటేల్

తర్వాతి కథనం
Show comments