Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు శ్రీకారం : విజయశాంతి

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 11 మార్చి 2022 (09:21 IST)
కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ మన దేశానికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి లభించనుందని జోస్యం చెప్పారు. 
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షణలోని బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ప్రజల హృదయాలలో బీజేపీ, ప్రధాని మోడీ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. 
 
ప్రతిపక్ష నేతలంతా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ బీజేపీపై పగబట్టినట్టుగా ప్రచారంతో పాటు దుష్ప్రచారం చేశారని, కానీ, ఓటర్లు విజ్ఞతతో తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో ప్రతిపక్షాలకు నిరాశ తప్పలేదన్నారు. 
 
మరీ ముఖ్యంగా... వైరి పక్షాలన్నీ బూచిగా చూపిన వ్యవసాయ చట్టాల ప్రభావం ఏమీ లేదని తేలిపోయిందని విజయశాంతి అన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా నిజమేంటో ఓటర్లు గ్రహించి అధికార పీఠాన్ని బీజేపీకే అప్పగించాలని నిర్ణయించారని చెప్పారు. 
 
జాతీయవాదంతో జాతి సమగ్రత, సమైక్యత  లక్ష్యంగా కొనసాగుతున్న బీజేపీ పాలనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవాలని,  అందుకే 37 సంవత్సరాల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని రాములమ్మ తెలిపారు. 

అన్నీ చూడండి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments