మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:39 IST)

తెలంగాణ సచివాలయ భవనం కూల్చిపేత పనులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. పోలీసుల భారీ బందోబస్త్ మధ్య మంగళవారం తెల్లవారుజాను నుంచి భారీ యంత్రాలతో భవనాలను కూల్చివేస్తున్నారు. తొలుత సి బ్లాకు కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. 
 
కూల్చివేత పనులకు అడ్డంకులు లేకుండా ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు. నిజానికి కూల్చివేత పనులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో పనులు ఆలస్యమయ్యాయి.
 
సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్తదాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది. ప్రస్తుతం సచివాలయ సి-బ్లాక్‌ను కూల్చివేసే పనులు ప్రారంభించింది.