బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (15:13 IST)

నా పుట్టుక తెరాసలోనే.. నా చావు కూడా తెరాసలోనే : మంత్రి హరీష్ రావు

పార్టీ మారుతున్నట్టు సాగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. తన పుట్టుక తెరాసలోనే.. తన చావు కూడా తెరాసలోనే అంటూ పునరుద్ఘాటించారు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం కావాలంటూ, దాన

పార్టీ మారుతున్నట్టు సాగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. తన పుట్టుక తెరాసలోనే.. తన చావు కూడా తెరాసలోనే అంటూ పునరుద్ఘాటించారు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం కావాలంటూ, దానికి తనవంతు కృషి చేస్తానంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. 
 
ఈ దిశగా ఆయన అడుగులు కూడా వేస్తున్నారు. దీంతో ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ నియమితులవుతారన్న ఊహాగానాలు వచ్చాయి. దీన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావు.. బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై హరీష్ రావు స్పందించారు. 
 
తాను తెరాసను వీడే ప్రసక్తే లేదన్నారు. నేను పుట్టింది తెరాసలో.. నా చావు కూడా తెరాసలోనే అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్టు హరీష్ రావు మీడియాకు వెల్లడించారు.