శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (15:05 IST)

'చంద్రముఖి' చిత్ర దర్శకుడు చనిపోయారా?

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు.

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు. 
 
'ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్లగానే నేను చనిపోయానని వదంతులు వస్తున్నట్టు వాట్సాప్‌లో నాకో సందేశం వచ్చింది. అది చూసి నవ్వుకున్నాను. ప్రజలకు నాపై ఇంత అభిమానం ఉందని తెలిసి సంతోషించాను కూడా. నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ యేడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను' అంటూ తన డెత్‌ దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 
 
కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకు వాసు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం. అలాగే, ఆయన పలు చిత్రాల్లో వివిధ రకాల క్యారెక్టర్లలో కూడా నటించారు.