శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (12:23 IST)

పంచదార, ఉప్పుతో మెరిసే సౌందర్యం

పంచదార మృతకణాలను నశింపజేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుంది. పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకునే విధానం మీ కోసం... పావు కప్

పంచదార మృతకణాలను నశింపజేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుంది. పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకునే విధానం మీ కోసం... పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు ముదురు రంగు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మ మృదువుగా, తేమగా ఉంటుంది. 
 
చర్మసౌందర్యంతో పాటు బాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదారకు ఉంది. గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించే నివారిణిగా పంచదార ఉపయోగపడుతుంది. ఇక చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో తేనెను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా తేనెను వాడుతారని బ్యూటీషియన్లు చెబుతున్నారు.