1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (14:49 IST)

కలబంద జ్యూస్‌తో గ్రీన్ టీ తాగండి.. బరువు తగ్గండి..

సహజంగా మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామంతోపాటూ, కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోవాలి. బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే కలబందకు మి

సహజంగా మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామంతోపాటూ, కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోవాలి. బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే కలబందకు మించిన ఔషధం లేదంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. పోషకాహారం, వ్యాయామంతో పాటు కలబంద రసాన్ని తీసుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. 
 
కలబందరసం, అల్లం రసం చెరో చెంచా తీసుకుని కప్పు నీటీలో సన్నని సెగపై వేడి చేసి పరగడుపున తీసుకుంటే బరువు తగ్గొచ్చు. కలబందలో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ వంటివి శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను తొలగిస్తాయి. 
 
సన్నబడాలంటే రోజూ కలబంద రసాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. కలబంద రసం బరువు తగ్గించడంతో పాటు చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే రోజు కలబంద గ్రీన్ టీని తాగితే మంచిది. గ్రీన్ టీ పొడిని రెండు గ్లాసుల నీటిలో మరిగించి కప్పులోకి తీసుకోవాలి. దానికి కలబంద జ్యూస్‌ను చేర్చి.. తేనెను ఒక స్పూన్ కలిపి రోజూ పరగడుపున తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.