మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (16:49 IST)

శెనగలను స్నాక్స్ తీసుకుంటే మధుమేహం పరార్

శెనగలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శెనగలను ఉడికించి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల్లోపు తీసుకోవాలి. స్నాక్స్‌గా బజ్జీలు వంటి ఇతరత

శెనగలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శెనగలను ఉడికించి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల్లోపు తీసుకోవాలి. స్నాక్స్‌గా బజ్జీలు వంటి ఇతరత్రా నూనె పదార్థాలు తీసుకోవడం కంటే శెనగలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. శెనగల్లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం, పీచు సమృద్ధిగా లభిస్తాయి. 
 
అంతేగాకుండా వీటిలోని మాంగనీస్‌, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చిన్నారులకు ప్రతిరోజూ వీటితో చేసిన స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. అలాగే మధుమేహం వున్నవారికి కూడా శెనగలు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయుల్ని శెనగలు పెంపొందింపజేస్తాయి. తద్వారా డయాబెటిస్ దరిచేరదు.
 
రక్తహీనత తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శెనగల్లో వుండే పోషకాలు గుండెకు బలాన్నిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు శెనగలను రోజూ కప్పు తీసుకోవచ్చు. ఇందులో వుండే ఫాలేట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.