శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (14:38 IST)

వంకాయతో మధుమేహానికి చెక్

వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ విటమిన్లు నాడీవ్యవస్థకు మేలు చేస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. విటమిన్ - సి కూడా వంకాయ ద్వారా సమృద్ధిగా లభి

వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ విటమిన్లు నాడీవ్యవస్థకు మేలు చేస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. విటమిన్ - సి కూడా వంకాయ ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్-బి, పొటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. డయాబెటీస్‌తో బాధపడేవారు వంకాయలను వారంలో ఒక్కసారైనా వంటల్లో చేర్చుకోవాలి.
 
వంకాయలో క్యాలరీస్‌ అస్సలు ఉండవు. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వంకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. 
 
వంకాయ వయసు పైబడే లక్షణాలను తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. నరాల వ్యాధులను దూరంగా ఉంచుతుంది. వంకాయ వాతాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.