శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Preeti
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (12:31 IST)

కీళ్ల నొప్పుల పాలిట వరం ఈ ఆకు... దోశెల్లో కలుపుకుని తింటేనా?

బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పె

బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులకు ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వారానికొకసారి ఈ బుడ్డకాకర ఆకుతో దోశె చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీన్నే గ్రీన్ దోశె అని కూడా అంటారు.
 
తయారీ విధానం:
మనం మామూలుగా దోశె వేసుకోవడానికి పిండి తీసుకుని అందులో ఈ ఆకులను, తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకుని దోశెలా పోసుకుని తినవచ్చు. లేదంటే దోశె పిండి తయారు చేసే సమయంలోనే ఈ ఆకులను, మెంతులను నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమన్ని పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని పులియబెట్టకూడదు. పెనంపై ఈ మిశ్రమాన్ని దోశెలుగా వేసుకుని తినవచ్చు.