శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (15:06 IST)

దాల్చిన చెక్క పొడితో ఇంత మేలా?

బరువు తగ్గాలనుకుంటే ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించేందుకు అరగంట ముందు దాల్చిన చెక్క పొడి, గ్రీన్ టీ ఆకులతో తయారు చేసిన టీని తాగాలి. దాల్చిన చెక్క పొడి, తేనె మిశ్రమం శరీర బరువును తగ్గిస్తుంది. ఒక చెంచా

బరువు తగ్గాలనుకుంటే ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించేందుకు అరగంట ముందు దాల్చిన చెక్క పొడి, గ్రీన్ టీ ఆకులతో తయారు చేసిన టీని తాగాలి. దాల్చిన చెక్క పొడి, తేనె మిశ్రమం శరీర బరువును తగ్గిస్తుంది. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దాల్చిన చెక్క శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్ల మీద పోరాటం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.
 
ఇంకా బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలోనూ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగొచ్చు. ఇలా చేయడం ద్వారా మధుమేహం, హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ టీ తాగితే కణాల వృద్ధి, విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే చలి కాలంలో వేధించే జలుబు, దగ్గు తగ్గాలంటే ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.