సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (09:46 IST)

వాల్‌నట్స్‌తో ఆ సామర్థ్యం పెరుగుతోందట

వాల్‌నట్స్‌ను రోజూ గుప్పెడు తీసుకుంటే డయాబెటిస్ మాయమవుతుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది. వీటిన

వాల్‌నట్స్‌ను రోజూ గుప్పెడు తీసుకుంటే డయాబెటిస్ మాయమవుతుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాల్‌న‌ట్స్‌ను తింటే వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది. వీటిని తీసుకుంటే శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగుప‌డుతుంది. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేస్తుంది. ఒబిసిటీ దూరం అవుతుంది. క్యాన్సర్ వ్యాధిని అడ్డుకునే ఔషధ గుణాలు వాల్‌నట్స్‌లో పుష్కలంగా వున్నాయి. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరిగేందుకు వాల్‌నట్స్ దోహదపడతాయి. 
 
సంతానం పొందాల‌నుకునే వారికి వాల్ న‌ట్స్ మేలు చేస్తాయి. అదే స్త్రీలు వాల్‌న‌ట్స్‌ను తింటే రుతు స‌మ‌స్య‌లు పోతాయి. వాల్‌న‌ట్స్‌ను రోజూ తింటే ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌లు, మ‌హిళ‌లు వాల్‌న‌ట్స్‌ను త‌మ డైట్‌లో భాగంగా చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. రోజూ పది గ్రాముల మోతాదులో వాల్స్ నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.