కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలిస్తున్న ఏపీ సర్కారు : మంత్రి హరీష్ రావు
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెన్నా బేసిన్‌కు తరలిస్తుందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పైగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాల సమస్యను పరిష్కరించమంటే కేంద్రం మీనమేషనాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్రంతో తెరాస ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
అక్రమంగా ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను తీసుకెళ్తుంది. కృస్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా రావడం లేదు. కృష్ణా బేసిన్‌లో మా నీటి వాటా మాకు కావాలంటే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాం. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి తక్షణమే ట్రైబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని హరీశ్‌రావు చెప్పారు.