శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 31 అక్టోబరు 2019 (19:15 IST)

ఇద్దరు బాలికలపై వార్డెన్ లైంగిక వేధింపులు, చెప్పొద్దని వార్నింగ్

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. ఏడవ, ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై వార్డన్ లైంగికంగా వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

యాలాల మండలం రసూల్పూర్ వద్ద గల ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలను గత వారంరోజులుగా లైంగికంగా వార్డెన్ దశరథ్ వేధిస్తున్నాడని బాలికల కుటుంబ సభ్యులు తెలియజేశారు. 
 
తమపై జరిగిన లైంగిక చర్యలను కుటుంబ సభ్యులకు చెప్పొద్దని వార్డెన్ వాళ్లను పలుమార్లు బెదిరించాడు. పిల్లల ప్రవర్తనపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా జరిగిన విషయం తెలిసి షాక్ తిన్నారు. సంఘటనపై యాలాల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వార్డెన్ దశరథ్‌ను అదుపులో తీసుకున్నారు.