Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే బట్టతల వస్తోందని.. ఆత్మహత్య..

Written By సెల్వి
Updated: మంగళవారం, 28 జులై 2020 (15:05 IST)
పెళ్లికి ముందే బట్టతల వస్తోందన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నితిన్ హైదరాబాదులో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసేవాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఉప్పల్‌లో నివాసం ఉంటున్న నితిన్ తన ఆదాయంలోనే కొంత తల్లిదండ్రులకు కూడా పంపేవాడు. 
 
ఇటీవల అతనికి జుట్టు బాగా రాలిపోతోంది. దాంతో పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతే ఎలా అని భావించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కొంత డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో డబ్బు సంపాదన నిలిచిపోయింది. దానికితోడు సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది.
 
ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన నితిన్ స్నేహితులు గదిలో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టంతా రాలిపోతోందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments