శోభనానికి ఏర్పాట్లు చేస్తే.. నాలుగు రోజులు తప్పించుకున్నాడు.. ఎన్నారై ముంచేశాడు..
పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్ఆర్ఐ సంబంధం పేరుతో ఓ రైతు కుటుంబానికి టోకరా వేశాడు. అమ్మాయిల నుండి 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నం తీసుకున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రాండ్‌గా వివాహం జరిపించారు.
శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులు అనారోగ్యంతో తప్పించుకున్నాడు. యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చేసరికి యువతి అతనిని గట్టిగా నిలదీశాడు. దీంతో యువకుడు తాను గేనని విషయం చెప్పాడు. దీంతో యువతి కుటుంబం షాకైంది. అంతేగాకుండా అమెరికాలో నాలుగేళ్ల పాటు బాయ్‍ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు.
యువతీ అమెరికా వెళ్లిన తరువాత తన బాయ్ ఫ్రెండ్ తోనే కాపురం చేయాలని చెప్పడంతో యువతి షాక్ గురైయ్యింది. కూతురు నిజం చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.