శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (09:52 IST)

ప్రియుడిపై మోజు.. భర్తను దుప్పటితో చంపేసిన భార్య... ఎక్కడ.. ఎలా?

వివాహేతర సంబంధాన్ని మరో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ప్రియుడిపై మోజుపడిన ఓ మహిళ... కట్టుకున్న భర్తను కడతేర్చింది. నిద్రపోతున్న భర్తను దుప్పటితో గొంతు నులిమి హత్య చేసింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతమైన పూందమల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం ఓం శక్తి నగర్‌‌కు చెందిన ధరణీ ధరణ్‌ (39) అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య భవాని (31), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమలో జూన్ నెల 22వ తేదీన తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు భవానీ మహాబలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదుచేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవపరీక్షకు పంపించారు. పోస్టుమార్టం నివేదికలో ధరణీ ధరణ్‌ గొంతు నులిమి హత్యకు గురైనట్టు తేలింది. దీంతో భార్య భవానీని పోలీసులు అదుపులోక తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె మొబైల్ ఫోన్ డేటాను సేకరించగా, ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి మృతుడి ఇంటికి వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భవానిని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను, పుందమల్లికి చెందిన దినేష్‌ (31) ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  
 
నిజానికి మృతుడు ధరణ్, నిందితుడు దినేష్‌‌ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. తరచూ ధరణీ ధరణ్‌ ఇంటికి దినేష్‌ వచ్చేవాడు. ఈ క్రమంలో భవానితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. దినేష్‌కు ఇది వరకే వివాహమై భార్యను విడిచిపెట్టి ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో భవానితో వివాహేతర సంబంధానికి ధరణీ ధరణ్‌ అడ్డుగా ఉండటం అతన్ని హత్య చేసేందుకు పథకం వేసినట్లు తెలిసింది. గత 21వ తేదీ పురుగుల మందు తీసుకువచ్చిన దినేష్‌ దానిని భవాని ఇంటికి వెళ్లి ఇచ్చాడు. ఆహారంలో కలిపి ఇవ్వమని భవానికి చెప్పాడు. పథకం ప్రకారం ఆ రోజు రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన అతనికి భవాని ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది.
 
దాన్ని తిని నిద్రపోయిన ధరణీధరన్‌ మరుసటి రోజు ఉదయం లేచి వాంతులు చేసుకున్నాడు. తర్వాత కాఫీ తాగి మళ్లీ నిద్రించాడు. ఆహారంలో విషం కలిపి ఇచ్చినా భర్త చావక పోవటంతో భవాని దినేష్‌కి సమాచారం ఇచ్చింది. ఇద్దరు పిల్లలను తాతయ్య ఇంటికి పంపించింది. 
 
దినేష్‌ ఇంటికి రాగానే నిద్రపోతున్న ధరణీ ధరణ్‌ దుప్పటితో గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ధరణి ధరణ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా దుప్పటిని రెండు చేతులతో చుట్టి దినేష్‌ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భవాని నాటకం ఆడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.