ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:27 IST)

భర్తతో సినిమాకు వెళ్తే.. భార్య కనిపించట్లేదు..

భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్‌ రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్‌లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్‌రూమ్‌కు వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆమె కనిపించలేదు. 
 
శైలజతో గత మే నెలలో భాస్కర్‌ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య వద్ద సెల్‌ఫోన్‌ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబీ మాల్‌లో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.