ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (09:14 IST)

హైదరాబాద్‌లో మరో ఖాకీ రాసలీలలు.. భార్య ఫిర్యాదు

హైదరాబాద్ నగరంలో మరో పోలీసు ఉన్నతాధికారి సాగిస్తూ వచ్చిన రాసలీలలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహరంపై ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో ఈ వివాహేతర గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆ ఉన్నతాధికారి పేరు బాబూరావు. హైదరాబాద్ న

హైదరాబాద్ నగరంలో మరో పోలీసు ఉన్నతాధికారి సాగిస్తూ వచ్చిన రాసలీలలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహరంపై ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో ఈ వివాహేతర గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆ ఉన్నతాధికారి పేరు బాబూరావు. హైదరాబాద్ నగర కమిషనరేట్‌ ఆర్మ్‌డ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీగా పని చేస్తున్నారు. 
 
ఈయనకు 25 యేళ్ల క్రితం వేదశ్రీ అనే మహిళతో వివాహమైంది. వీరికి నలుగరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో బాబూరావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడు. అంతేకాకుండా, వేదశ్రీ పేరుమీద విజయవాడలో ఉన్న ఇంటిని కూడా ఫోర్జరీ సంతకాలతో అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న వేదశ్రీ డీజీపీ మహేందర్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేసింది.  
 
తనతో 25ఏళ్ల పాటు కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయిన బాబురావు విడాకులివ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తమకు తెలియకుండానే మతం మార్చుకున్నాడని, చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ.5 లక్షలు తీసుకుని విడాకులకు ఒప్పుకోవాలని వేధిస్తున్నాడని తెలిపింది. బాబురావు వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది.